కావలసినవి : ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, నూనె - తగినంత , ఎండుమిర్చి - 2, చింతపండు - కొద్దిగా , ఉప్పు - తగినంత , ఆవాలు - టీ స్పూను ,...
కావలసినవి :
ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి - 2, నూనె - తగినంత, ఎండుమిర్చి - 2, చింతపండు - కొద్దిగా, ఉప్పు - తగినంత, ఆవాలు - టీ స్పూను, జీలకర్ర- టీ స్పూను, బెల్లం తురుము - టీ స్పూను, కరివేపాకు - ఒక రెమ్మ
తయారి
- ఉల్లిపాయను చిన్నముక్కలుగా తరగాలి.
- పచ్చిమిర్చిని పొడవుగా మధ్యకు కట్ చేయాలి.
- బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఎండు మిర్చి వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
- చింతపండును పది నిముషాలు నీటిలో నాన బెట్టి, మూడు కప్పుల గుజ్జు వచ్చేలా తీయాలి.
- ఉప్పు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పొడి వేసి కలపాలి.
- చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాకఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి పచ్చిపులుసులో కలపాలి.
- బెల్లం తురుము, కరివేపాకు జతచేసి, బాగా కలిపి సర్వ్ చేయాలి.
COMMENTS