పిల్లలు ఈ మధ్య ఆధునికత, స్టైల్, సరదాకోసం అవసరం లేని ఆహారానికి అలవాటు పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనికిరాని ఆహ...
పిల్లలు ఈ మధ్య ఆధునికత, స్టైల్, సరదాకోసం అవసరం లేని ఆహారానికి అలవాటు పడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనికిరాని ఆహారాన్నే ఇంగ్లిషులో ‘జంక్ ఫుడ్’ అనీ వ్యవహరిస్తున్నారు. పిజ్జా, బర్గర్, పేస్ట్రీ, ఐస్‌క్రీం, కట్‌లెట్, పానీపూరీ, టోస్ట్, మళ్లీమళ్లీ నూనెల్లో వేయించిన బజ్జీలు, ప్యాకెట్లలో నెలల తరబడి నిల్వవుంచే చిప్స్, కోక్‌లు, ఎక్కువ తీపి, ఉప్పు ఉన్న పదార్థాలు ఇవన్నీ పనికిరాని ఆహారం కిందనే లెక్క. అలాగే డబ్బాలలో, ప్యాకెట్లలో ఏళ్ల తరబడి నిల్వవుంచే తినుబండారాలు, డ్రింక్స్‌లో కృత్రిమ చక్కెరలు, ఉప్పు, నిల్వవుండటానికి వాడే ప్రిజర్వేటివ్‌లు, హానికరమైన కృత్రిమరంగులు, ఫ్లేవర్స్, స్వీట్‌కార్న్స్, మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ ఎదిగే పిల్లల ఆరోగ్యానికి హానిచేస్తాయి. చౌకబారు ఐస్‌క్రీములు, ఐస్‌ప్రూట్స్, నల్లగా వేగిన పదార్థాలు, దుమ్ముధూళి నిండినవి, ఈగలు, దోమలు ముసురుతుండే రోడ్డు పక్కఆహారాలు కూడా పిల్లల సున్నితమైన ఆరోగ్యానికి హాని చేస్తాయి.
COMMENTS