vinayaka, ganesh, vigneshwara, vinayaka chavithi, telugu blog, apurupa, teluguh,
ఓం మహాగణాధిపతయే నమః
మనము తలపెట్టే ప్రతి శుభకార్యానికి మొదటిగా గణపతి పూజ తోనే ప్రారంభిస్తాం. అది పిల్లవాడి బారసాల, విద్యాభ్యాసం నుండి, వివాహం, శంకుస్థాపన, గృహ ప్రవేశం, వ్యాపార ప్రారంభోత్సవాలు, నూతన వాహనం కొనుగోలు ఇలా ఒక సందర్భం ఏమిటి మానవ జీవితంలో ప్రతి ప్రధానమైన శుభకార్యానికి మొదటిగా గణపతిని పూజించటం అనాదిగా వస్తున్న సాంప్రదాయం.
మనం మొదలుపెట్టే ప్రతి ముఖ్యమైన పని ఎటువంటి విఘ్నాలు రాకుండా విజయవంతంగా జరగాలని వినాయకుని ప్రార్ధిస్తూ ఉంటాం. వినాయకుడు జన్మించిన భాద్రపద శుద్ధ చవితి నాడు అన్ని విఘ్నాలపై ఆధిపత్యం జరిగినట్లుగా పురాణాల బట్టి పండితులు తెలుపు తున్నారు. మనదేశంతో పాటు ఇతర దేశాలలోని వారు కూడా ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చవితి నాడు, బంగారం, వెండి మట్టితో తయారు చేసిన వినాయకుని ప్రతిమలకు పూజించండం జరుగుతుంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి వినాయకుని పూజించటం వల్ల మంచి ఫలితాలు అందుతాయని నమ్మకం.

- మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడం వలన కరువు కాటకాలు రాకుండా, వ్యవసాయ అభివృద్ధి కలిగి, పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రతీతి.
- బంగారు గణపతి ప్రతిమ ఐశ్వర్యాభివృద్ధిని,
- వెండి ప్రతిమ ఆయురారోగ్యాన్నీ,
- రాగి ప్రతిమ సంకల్పసిద్ధిని,
- శిలా ప్రతిమ మోక్ష, జ్ఞానాలను అనుగ్రహిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
COMMENTS