vinayaka chavithi, ganesh chaturthi, telugu blog, apurupa, teluguh blog, teuguhblog, ganapathi
వేద, పురాణ, ఇతిహాస కాలాలనుంచి ఆధునికకాలం వరకు గణపతి ఆరాధన విస్తృతంగా
జరగుతుంది. వినాయక శబ్దానికి విశిష్టమైన వాడని, నాయకులు లేనివాడని
అర్థం. గణపతి గురించి గణేశ పురాణం, స్కాంద పురాణం, ముద్గల పురాణం, బ్రహ్మవైవర్తపురాణం, శివపురాణంలో కనిపిస్తుంది. రుగ్వేదంలో సైతం గణపతి గురించిన
ప్రస్తావన ఉంది. గణపతిని జ్ఞానానికి అధిదేవత అని రుగ్వేదం కొనియాడింది. గణాల
అధిపతిగా గణపతి పేరు సార్థకమయ్యింది. మానవులందరికీ మంచి చేసే వారిని గణపతి అని
అంటారు. మానవునిలోని చెడును హరించే వాడికి గణపతి అని, వినాయకుడని పేరు.
వినాయకునికి రోగహర శక్తి ఉందని గణేశ పురాణం చెబుతోంది. గణపతితో సమానమైన పేరు గల
బ్రాహ్మణస్పతి లేదా బృహస్పతి గురించి రుగ్వేదంలో సవివరమైన ప్రస్తావన కనిపిస్తుంది.
తనను ఆరాధించేవారిని గణపతి ఎల్లవేళలా కాపాడుతుంటాడని రుగ్వేదం వివరించింది.
COMMENTS