vinayaka, vigneshwara, apurupa, teulguh blog, vinaya chavithi special
మహాభారత రచనకు పూనుకున్న వేదవ్యాసుడు ధారాళంగా వచ్చే శ్లోకాలను వేగంగా వ్రాయటం కోసం వినాయకుని సహకారాన్ని కోరెను. వినాయకుడు అందుకు అంగీకరించి శ్లోకాలను ఆపకుండా చెప్పాలనీ అలా చెప్పినట్లయితే తాను అంతే వేగంతో ఆపకుండా రాస్తానని బదులిచ్చారు. అలా వ్రాస్తున్న సమయంలో వినాయకుని ఘంటము (కలం) విరిగెను. అయిననూ వ్యాసుడు ఆపక విరామం లేకుండా చెప్పసాగెను. ఆ తరుణంలో వినాయకునికి ఏమిచేయాలో పాలుపోక తన దంతాన్ని విరిచి దాని సాయంతో ఆపకుండా వ్రాసి భారతాన్ని పూర్తి చేసెను. అది గాంచిన వ్యాసుడు విఘ్నము లేకుండా వ్రాసినందుకు నేటి నుండి వీవు విఘ్నరాజువై వెలుగొందువని వరమిచ్చెను.
COMMENTS