vinayaka chavithi special, telugu blog, ganesh, vigneshwara, apurupa, teluguh blog
కావలసినవి :
బియ్యం పిండి : 1 కప్పు
నీళ్ళు : 1 కప్పు
నెయ్యి : 2 గరిటెలు
వంట సోడా : చిటికెడు
ఉప్పు : చిటికెడు
ఉండ్రాళ్ళలో నింపడానికి పచ్చి కొబ్బరి
కోరు: 1 కప్పు
కొబ్బరి పొడి : 1/2 కప్పు
వేయించిన గసాలు : 1 గరిటెడు
యాలకుల పొడి: 1/2 చెంచా
తయారుచేసే విధానం :
కొబ్బరి, బెల్లం, యాలకుల పొడి, గసాలు కలిపి ఒక పాన్లో వేడి చెయ్యాలి. ఈ మిశ్రమం కాస్త ఉండ కట్టే
మాదిరి అయ్యే వరకూ ఉంచి దించాలి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని వేడి చెయ్యాలి.
ఉప్పు, నెయ్యి వేసి మరిగిన తరువాత బియ్యం
పిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతు ఉండాలి. తక్కువ మంట పైన
పిండిని ఉడికించి గట్టిపడిన తరువాత దీన్ని ఒక వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని
చల్లార్చాలి. పిండిని నెయ్యి రాసుకున్న చేత్తో కలిపి చిన్న ఉండను తీసుకుని చిన్న
బంతుల్లాగా తయారు చేసి అందులో కొబ్బరి పాకాన్ని కొద్దిగా ఉంచి మూసివేసి, గుండ్రంగా ఉండ్రాళ్ళలా చుట్టాలి. లేదా మీకిష్టమైన ఆకృతుల్లో చేసి
వీటిని తిరిగి ఒక గిన్నెలో పేర్చి కుక్కర్లో ఆవిరిపైన ఉడికించాలి. వీటిని
వేడిగానైనా లేదా చల్లారాక అయినా నేతితో తింటే చాలా రుచిగా ఉంటాయి.
COMMENTS