vinayaka, ganesh, vigneshwara, telugu blog, apurupa, teluguh blog,
పూజా ద్రవ్యములు :
వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షింతలు, బియ్యం, దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, ఆవు నేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పళ్ళు, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పంచపాత్ర, ఉద్ధరిణి. పళ్ళెం, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు, పాలవెల్లి, ప్రత్తితో చేయబడిన వస్త్రములు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠము.
నైవేద్యం :
ఉండ్రాళ్లు - 21, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరి ముక్కలు, బెల్లం, అరటి పళ్ళు, పిండివంటలు మొదలగునవి.
పూజాపత్రి :
మాచి, బలురక్కసి లేక ములగ, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్ల మద్దె, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి ఆయా మంత్రములతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపము కల్గినను భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలములో లభ్యము కానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.
COMMENTS