vinayaka chavithi, telugu blog, apurupa, teluguhblog, vigneshwara, ganapati
శ్వేత్కార గణపతి విగ్రహాన్ని వ్యాపార స్థలంనందుంచి ప్రతినిత్యం అర్చించి, అటుకులు, బెల్లం నివేదన చేసి గణపతి స్తోత్రం పారాయణ చేసినచో వ్యాపారాభివృద్ధితో పాటు దృష్టి దోషం తొలగును. ప్రతి అమావాస్య రోజు కొబ్బరి కాయను శ్వేత్కార గణపతి వద్ద ఉంచి రాత్రి షాపు మూసేవేళ వినాయకుని ముందున్న కొబ్బరికాయను దిష్టి తీసి షాపు ముందుభాగంలో పగులగొట్టి ముక్కలు ఒక ప్రక్కకు తోసి కాళ్లు చేతులు, ముఖం నీళ్ళతో కడుక్కుని, నోరు పుక్కిలించి స్వామికి హారతినిచ్చి ప్రసాదం తీసుకున్న పిదప షాపును కట్టేయవలెను. ఈ విధంగా చేసిన వ్యాపారాభివృద్ధి కలుగును.
COMMENTS